సందీప్ కిషన్ హీరోగా అందాల రాక్షసి ఫేమ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం A1 ఎక్స్ ప్రెస్. అయితే ఈ సినిమా పైనే సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసినప్పటికీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మునుపటికంటే కాస్త హాట్ నెస్ పెంచినట్లు తెలుస్తోంది.
లిప్ లాక్ సీన్లకు కూడా లావణ్య త్రిపాఠి పచ్చజెండా ఊపేసినట్లు తాజాగా విడుదలైన A1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. మరోవైపు యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న చావు కబురు చల్లగా చిత్రంలో కూడా లావణ్యత్రిపాఠి గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాల తర్వాత అయినా లావణ్యత్రిపాఠి కెరీర్ మారుతుందో లేదో చూడాలి.