అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అమ్మడు లావణ్య త్రిపాఠి. తన నవ్వుతో యువతని ఆకట్టుకున్న లావణ్య బలే బలే మగాడివోయ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగు అంతగా అవకాశలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా తన అందచందాలను ఒలకబోస్తుంది ఈ సొట్టబుగ్గల చిన్నది. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా కొత్త స్టిల్స్ తో ఫోటోలు పోస్ట్ చేసే లావణ్య లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ చిన్నదాని ఫోటోలు చుసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా వస్తున్న అర్జున్ సురవరం సినిమా ఈ సుందరి నటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 29 ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.