అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో పరిచయం అయిన బామ లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు మినహా మిగిలిన సినిమాలు నిరాశపరచటంతో ఈ అందాల రాక్షసి టాలీవుడ్ కి దూరం అయ్యింది.
ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. నిమ్మపండు రంగు కలర్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా నిలుచుని ఫోజులిస్తూ లావణ్య పెట్టిన ఫోటోకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.