జార్ఖండ్ లో ఓ లా స్టూడెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ రాజధాని రాంచి హై సెక్యూర్టీ జోన్ లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ నెల 26న నగర శివారులోని సంగ్రామ్ పూర్ లో ఓ లా స్టూడెంట్ నడిచి వెళ్తుండగా మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను పిస్టల్ తో బెదిరించి బైక్ మీద తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో ఫ్రెండ్స్ ను కారు తీసుకొని రమ్మని ఫోన్ చేశారు. ఫ్రెండ్స్ కారు తీసుకొని వచ్చాక ఆ అమ్మాయిని సమీపంలోని ఓ ఇటుక బట్టీ దగ్గరకు తీసుకెళ్లి 12 మంది అత్యాచారం చేశారు. సృహ కోల్పోయిన బాధితురాలు మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన జరిగిన ప్రాంతం ఆ అమ్మాయి చదివే లా కాలేజీకి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి 10 కిలో మీటర్ల దూరంలో ఉంది. సంఘటన జరిగిన ప్రాంతంలోనే డీజీపీ, హైకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి ఫిస్టల్, కారు, బైక్, మొబైల్ ఫోన్లతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సీ,ఎస్టీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.