బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి సుజిత్ మృతిపై డైరెక్టర్ రాఘవ లారెన్స్ భిన్నంగా స్పందించాడు. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఘటనలో సుజిత్ మృతి చెందటంతో ఆ తల్లితండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అయితే… మీ బాధను అర్థం చేసుకోగలను. సుజిత్ లేని లోటు తీర్చలేనిది కానీ దాన్ని అదిగమించేందుకు వీలైతే ఓ బిడ్డను దత్తత తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. అలా చేస్తే ఆ చిన్నారి చదువులకు అయ్యే పూర్తి ఖర్చును తాను భరిస్తానని ప్రకటించారు లారెన్స్. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది.
లారెన్స్ ఇలా చిన్నారులను చదివించటం, తల్లితండ్రులు లేని పిల్లలను చేరదీయటం ఎక్కువగా చేస్తుంటారు.