ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ ప్రభుత్వం మధ్య ఉన్న వైరం తెలిసిందే. రెండు పక్షాలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎన్నికలు నిర్వహణపై రగడ కొనసాగుతున్న తరుణంలోనే శ్రీనివాస రావు అనే న్యాయవాది కమిషననర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కమిషనర్ ఏపీ ప్రభుత్వం నుండి జీతభత్యాలు తీసుకుంటున్నారని, తను ఉండే ఇంటికి సైతం హౌజ్ అలవెన్స్ తీసుకుంటూ… తను మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నారని బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం జీతాలను తీసుకొని ఇతర రాష్ట్రాల్లో ఉండటమేంటని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.