పెద్దపల్లి జిల్లా మంథనిలో హైకోర్టు లాయర్లు వామనరావు, నాగమణి హత్యకు అసలు కారణం వేరే ఉందా…? పుట్ట మధు స్థానిక పోలీసు బాస్ తో కలిసి అక్రమ కేసులు పెడుతూ, ఇబ్బందిపెడుతున్న సాక్ష్యాలను వామనరావు సంపాదించడా…? 2014తర్వాత ఆ జిల్లాలో నమోదైన పీడీయాక్టుల చిట్టా మొత్తం ఆయన వద్ద ఉందా…? పుట్ట మధు అక్రమాస్తుల ఆధారాలతో పాటు ఎవరెవర్నిఇబ్బందిపెడుతున్నారో కేంద్ర హోంమంత్రికి వామనరావు పత్రాలిచ్చాడా…? కాళేశ్వరం అవినీతికి… వామనరావు హత్యకు లింకుందా…?
ఇప్పుడివే ప్రశ్నలు మంథనిలో హాట్ టాపిక్ గా మారాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోనే పుట్ట మధు అవినీతి మొదలైందని… అక్రమంగా ఇసుక తరలింపు, అక్రమంగా కలపను బార్డర్లు దాటించేవారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు వామనరావు సేకరించాడని తెలుస్తోంది. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికతో ఇటీవల వామనరావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్వయంగా అందించినట్లు జోరుగా చర్చ సాగుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాతే వామనరావుకు ఇక వదలొద్దన్న నిర్ణయానికి వచ్చినట్లు సర్వత్రా ప్రచారంలో ఉంది.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో హత్యకు వ్యూహాం ఖరారైందని, ఎలాగైనా బ్రతకనివ్వొద్దన్న నిర్ణయానికి వచ్చారని… ఇప్పటికే కేసీఆర్ పై నేరుగా కాళేశ్వరం అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో… వామనరావు నివేదికలు బహిర్గతం అయితే ప్రమాదం అన్న ఉద్దేశం ఉందన్న అభిప్రాయంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు టాక్ వినిపిస్తోంది.