దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్యకేసులో మరింత పురోగతి లభించింది. ఈ కేసులో కీలకమైన నిందితుడు పోలీసులకు చిక్కాడు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యలకు మూలకారణంగా బిట్టు శ్రీనివాస్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఆతడిని అరెస్టు చేసినట్లు డీసీపీ రవీందర్ చెెెెెప్తున్నారు.
న్యాయవాద దంపతులు హత్య కోసం కుంట శ్రీనివాస్ కు.. కారు, కత్తులు బిట్టు శ్రీనివాస్‌నే సమకూర్చినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బిట్టు శ్రీనివాస్ అరెస్ట్‌తో మరిన్ని కీలక విషయాలు బయపటడే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.