హైకోర్టు లాయర్లు వామన్ రావు, ఆయన భార్య నాగమణి హత్యలో మరో సంచలన నిజం తెరపైకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్నది మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అని ప్రచారం సాగుతుండగా… కేవలం కుంట శ్రీనివాస్ పేరు మాత్రమే ఇప్పటి వరకు తెరపైకి వచ్చింది.
కానీ కత్తులతో దాడి తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న లాయర్ వామన రావు… పుట్ట మధు పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో ఆయన ప్రమేయం, లాకప్ డెత్ అయిన శీలం రంగయ్య కేసులోనే పుట్ట మధు హత్య చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరుతుందని, ఆయన పాత్రపై లోతైన దర్యాప్తు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
కుంట శ్రీనివాస్ వంటి పాత్రదారులను మాత్రమే శిక్షిస్తే సరిపోదని, సూత్రదారులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.