నవనీత్ కౌర్ అనారోగ్యం పాలైనట్టు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఇప్పటికే జైలు సూపరింటెండెంట్ కు ఆయన లేఖ రాశారు. ఆమెకు సహాయం అందించాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా వైద్య చికిత్స అందిచాలని ఆయన కోరారు.
కానీ ఆమెకు జైలు అధికారులు సరైన వైద్యం అందించడం లేదంటూ ఆయన ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమెకు సరైన వైద్య చికిత్స అందించాలని లేఖలో కోరారు.
అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కోర్టుకు తీసుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నట్టు తెలిపారు.
కౌర్ దంపతుల బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పిటిషన్ పై నేడు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కోర్టు వాదనలు విననుంది.