తెలంగాణ ప్రజలెవరూ కేసీఆర్ డ్రామాలు నమ్మరని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో అరుపులు.. ఢిల్లీలో కాళ్లు పట్టుకోవడం సీఎం కేసీఆర్‌కు అలావాటేనని విమర్శించారు. వంగి వంగి దండాలు పెడుతున్న కేసీఆర్ తీరు ప్రజలకు అర్ధమైందని ఎద్దేవా చేశారు.
రైతుల బంద్ కు మద్ధతిచ్చిన సీఎం కేసీఆర్… ఢిల్లీలోనే ఉండి రైతులకు ఎందుకు మద్దతు తెలుపలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. సన్నవడ్లు పెట్టుమని, ఆయనే వాటిని కొనుగోలు చేయడంలో విఫలమయ్యారన్నారు. దళారుల జేబులు నింపడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ కు భజన సంఘాలుగా మారాయని విమర్శించారు. ఎదురుగాలి వీస్తోందనే ఉద్యోగాల భర్తీ అని మోసం చేస్తున్నారన్నారు. కానీ కేసీఆర్ డ్రామాలను నిరుద్యోగులు నమ్మరని లక్ష్మణ్ స్పష్టం చేశారు.