హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించి సమ్మెకు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు రాజకీయ నేతల పరామర్శలు, పలకరింపులు షురూ అయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపో దగ్గర సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి
పలకరించారు. మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తమ వంతు చొరవ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మాకు న్యాయం చేయాలని కార్మికులు ఆయనకు విన్నవించుకున్నారు.