సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో చివరిసారిగా మాట్లాడారు. తను భారతీయ ముస్లీంను అయినందుకు గర్వపడుతున్నానని, తన జీవితకాలంలో ఎన్నడూ పాకిస్తాన్ వెళ్లలేదని… తనకు మంచే జరిగిందన్నారు.
జమ్మూ కాశ్మీర్ నుండి తను ఢిల్లీ రాజకీయాల్లో ఉండటం వరకు తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పిన ఆజాద్… ప్రధాని కన్నీరుపెడుతూ ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలిపారు.
తన చివరి ప్రసంగంలో మాజీ ప్రధాని అటల్ బీహర్ వాజ్ పేయిని గుర్తు చేసిన ఆజాద్… సభను ఎలా నడపాలి, కీలక సమయాల్లో ఎలా ముందుకు సాగాలో ఆయన నుండే నేర్చుకున్నట్లు తెలిపాడు.