జాతీయ జెండా ఆవిష్కరణ కారణంగా ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయం కాస్తా స్థానికంగా సంచలనంగా మారింది. వికారాబాద్ లోని దోమ ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన గణతంత్ర వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు చోటు చేసుకుంది.
జెండా ఆవిష్కరణకు సిద్ధమైన ఎంపీపీ అనసూయను.. వైఎస్ ఎంపీపీ మల్లేశం అడ్డుకున్నారు. ఎంపీడీఓ జెండాను ఆవిష్కరించాలి.. మీరెందుకు ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎంపీపీ కుమారుడు రాఘవేందర్ కి, వైఎస్ ఎంపీపీ మల్లేశం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఎంపీడీఓ జెండాను ఆవిష్కరిస్తూనే.. ఇద్దరు నేతలను తిట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతల తీరుతో జాతీయ జెండా ఆవిష్కరణ సభకు తీవ్ర అవమానం జరిగిందని స్థానికులు అంటున్నారు.
ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలే అయినా.. కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఎంపీపీ అనసూయ దూరం పాటిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ వద్ద ఉండి బీఆర్ఎస్ లో మరో గ్రూపుగా కొనసాగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.