టెక్నాలజీని మనోళ్లు మామూలుగా వాడడం లేదు. యూట్యూబ్ లో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ ప్రింట్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. కృష్ణా జిల్లా పెడనలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి.. వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించింది ఓ ముఠా. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
యూట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి.. వాటిని ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా నేర్చుకుని పక్కాగా అమలు చేయాలనుకుంది ఈ ముఠా. అయితే పోలీసులు మాత్రం వారి ప్లాన్ కు చెక్ పెట్టారు.
మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు మచిలీపట్నం డీఎస్పీ మసూంబాషా. వీరి నుంచి రూ.4లక్షల నకిలీ కరెన్సీ.. రూ.32,700 ఒరిజినల్ నగదు స్వాధీనట్లు వివరించారు.