ఇంటర్ స్టూడెంట్ ని చితకబాదిన లెక్చరర్ - Tolivelugu

ఇంటర్ స్టూడెంట్ ని చితకబాదిన లెక్చరర్

ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోన్న విద్యార్థి ని కాలేజి లెక్చరర్ చితకబాదిన సంఘటన కర్నూల్ జిల్లా నందికొట్కూరు లోని నంది జూనియర్ కాలేజీ లో చోటు చేసుకుంది. విద్యార్థులందరూ క్యూలైన్ లో కూర్చోవాలని మందలించినందుకు ఫైజుల్లా అనే విద్యార్థి లెక్చరర్ పై తిరగబడ్డాడు. ఆగ్రహంతో లెక్చరర్ ఫైజుల్లాను చితకబాదాడు. ఆ సమయం ఫైజుల్లా తలకు గాయమయ్యింది . కాలేజీ కి చేరుకున్న ఫైజుల్లా తల్లిదండ్రులు, బంధువులు లెక్చరర్ పై దాడికి దిగారు. తమ బిడ్డను ఎందుకు కొట్టారంటూ ఆందోళనకు దిగారు. దీనితో కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది .

Share on facebook
Share on twitter
Share on whatsapp