హైదరాబాద్ లో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లయోలా డిగ్రీ కాలేజీలో ఓ యువతి ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై ఉమా మహేశ్వరరావు అనే లెక్చరర్ గత కొంత కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. యూనిమేషన్ డిపార్ట్ మెంట్ కి చెందిన ఉమా మహేశ్వరరావు.. ఆ యువతికి మూడేళ్లగా NCC ట్రైనర్ గా ఉన్నాడు.
ఆ అమ్మాయి రెండు పరీక్షలకు వెళ్లకుండా మిస్ కావడంతో.. ఆమెకు మరోసారి పరీక్ష కండక్ట్ చేసే అవకాశం కల్పిస్తానని ఆశ చూపించాడు. దానికి ప్రతిఫలంగా ఏం ఇస్తావని ఆ విద్యార్థినిని అడిగాడు. డబ్బు, బంగారం ఇస్తావా? సెక్సువల్ గా సంతృప్తి పరుస్తావా? అని వేధిస్తూ ఉండేవాడని ఆమె ఆరోపిస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.