త్రిపుర బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేవ్ తన ముఖ్యమంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. ఊహించని ఈ పరిణామంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఆ కొద్ది సేపటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ మాణిక్ సాహాను తదుపరి ముఖ్యమంత్రిగా నియమించారు.
రాష్ట్ర బీజేపీలో ఎందరో ప్రముఖ నేతలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది అందరిని విస్మయానికి గురి చేసింది.
అయితే ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని సీఎంగా బీజేపీ నియమించడం ఇది తొలిసారి కాదు. గతంలో రెండు సార్లు బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
హిమంత బిశ్వశర్మ:
హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండేవారు. పార్టీపై అసంతృప్తితో ఆయన 2015లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ విజయాల కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో ఆయన్ని 2021లో అసోం సీఎంగా బీజేపీ నియమించింది.
బిరెన్ సింగ్ః
ఎన్. బిరేన్ సింగ్ సైతం 2106లో కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మణిపూర్ లో 15 ఏండ్ల తర్వాత కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. దీంతో బీజేపీ నుంచి బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.