బ్రహ్మానందం నేడు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానుల అభిమానాన్ని పొందాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా బ్రహ్మానందం చేరారంటే ఆయన ప్రతిభ గురించి అర్థం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఇచ్చింది.
ఆయన కెరీర్ లో 5 నంది అవార్డులు, ఒక ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో ఎక్కువగా వచ్చే మీమ్స్ లో బ్రహ్మానందం కనిపిస్తూ ఉంటారు. తాజాగా ఈ మీమ్స్ లను ఫోటో ఫ్రేమ్ తో మీమ్స్ గాడ్ అంటూ బర్త్ డే విషెస్ తెలుపుతూ ఆయనకు గిఫ్ట్ గా అందచేశారు కొంతమంది ఫాన్స్. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తున్నందుకు కనిపించేటట్లు చేసిన నా అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందరూ బాగుండాలి అంటూ బ్రహ్మానందం కోరారు.