టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు త్వరలో రిటైర్ కాబోతున్నారు. కాకపోతే సినిమాల నుంచి కాదు.. ఓ సినిమాలో రిటైర్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. 78 ఏళ్ల వయస్సులో తొలిసారి తనలోని నటుడిని ఆవిష్కరించబోతున్నారు.
ఎందరో కొత్తవారిని తెలుగు తెరకు పరిచయం చేసి.. టాప్ హీరో, హీరోయిన్లుగా తీర్చిదిద్దిన రాఘవేంద్రరావును మాత్రం నటుడిగా పరిచయం చేయబోతున్నదెవరో కాదు.. తణికెళ్లభరణి. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ప్రాజెక్టు తెరకెక్కబోతున్నట్టుగా ఫిలింనగర్‌లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. వచ్చే మార్చిలో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.