ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఏమి చేసినా ఓ లాజిక్, మేజిక్ ఉంటుంది. తాజాగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ఓ రేంజ్‌లో వుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు, దర్శక ధీరుడు కసిగా చేసే మెగా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ ఆర్. ఈ క్రేజీ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగాయి.
తన గత చిత్రాలకు ఇది కాస్త భిన్నంగా ఉండాలని రాజమౌళి ప్లాన్ చేశాడట. రాజమౌళి సినిమాల్లో పాటలంటే సాధారణంగా మంచి మెలోడీ బీట్ సాంగ్స్ ఉంటాయి. ఎలాంటి కథకైనా కమర్షియల్ హంగులు, దండిగా పాటలు గత ఫార్ములా. ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ మాత్రం అల్లూరి, కొమురం భీం కథాంశం కావడంతో ఆ ఫార్ములాను రాజమౌళి మార్చేందుకు రెడీ అయ్యారట. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అన్న రీతిలో కథలో భాగంగా కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయట. చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతంలో మరో పాట వినిపించనున్నారట. దటీజ్ రాజమౌళి!