ఒడియా లెజెండరీ సింగర్, ప్రముఖ సంగీత దర్శకుడు ప్రఫుల్ల కార్ ఇక లేరు. వయో సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆదివారం భువనేశ్వర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఆయన తనకు ఛాతీలో నొప్పిగా ఉందనీ ఆదివారం రాత్రి తన కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వైద్యులకు వారు ఫోన్ చేశారు. కానీ ఈ లోగానే ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన మరణంపై పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రపుల్ల మృతి పట్ల ప్రధాని మోడీ, ఒడిశా గవర్నర్ గణేశ్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
‘ ప్రఫుల్ల కర్ జీ మరణించడం బాధాకరం. ఒడిశా సంస్కృతికి, సంగీతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.