సహజంగా వివాహాలకు వచ్చే బంధువులు, స్నేహితులు వధూవరులకు గిఫ్ట్ లు చూస్తుంటాం. కానీ.. ఈ మధ్య పెళ్లిళ్లకు హాజరైన బంధువులు వినూత్న బహుమతులను అందిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని బంధుమిత్రుల సమక్షంలో ఒక బాటిల్ పెట్రోల్, డీజిల్ ను గిఫ్ట్ రూపంలో ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. ఇప్పు మరో జంటకు వినూత్న బహుమతి అందించి ఔరా అనిపిస్తున్నారు.
వేసవి కాలం కావడంతో నిమ్మకాయల ధరల మోత మోగిపోతున్నాయి. నిమ్మకాయలు అత్యంత ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. అందుకే ఓ పెళ్లి వేడుకలో స్నేహితులు వధూవరులకు గిఫ్ట్‌గా నిమ్మకాయలను అందించారు. ఇది గుజరాత్ లోని రాజ్‌కోట్ ధరోజీ పట్టణంలో ఓ జంట వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లికి వరుడి స్నేహితులు హజరయ్యారు. అయితే.. వారంతా కలసి ఆ కొత్త జంటకు నిమ్మకాయలను బహుమతిగా అందజేశారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవసరానికి అవకాశాలు అంటు కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వివాహ వేడుకల్లోనూ యువకులు వనూత్న రీతిలో ఆలోచిస్తున్నారు.
నిమ్మకాయలు ధరలు బాగా పెరిగాయని, ఈ సీజన్‌లో నిమ్మకాయల వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని.. అందుకే వాటినే గిఫ్ట్‌గా ఇచ్చామని వారు చెప్పారు “ఈ సమయంలో రాష్ట్రంలో దేశంలో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి.. ఈ సీజన్‌లో నిమ్మకాయల అవసరం ఎక్కువగా ఉంది.. అందుకే నిమ్మకాయలు ఇచ్చాం” అని వరుడి బంధువు దినేష్ చెప్పారు.