విజయ్, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ లియో. భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నాడు. ఫస్ట్ హీరోయిన్ గా త్రిష, సెకెండ్ హీరోయిన్ గా ప్రియా ఆనంద్ ను తీసుకున్నారు. అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి లియో అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అదే ఊపులో ఈ చిత్రం కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభమైయింది. ఈ షెడ్యూల్ విజయ్, త్రిషలతో పాటు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు.
7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. లియో సినిమాను సౌత్ తో పాటు.. నార్త్ లో హిందీతో పాటు మరో 3 భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు. దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది లియో.