తలపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లియో. వారసుడు సినిమాతో హిట్ అందుకున్న విజయ్, విక్రమ్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న లోకేశ్ కలిసి చేయబోయే మేజిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘విక్రమ్’ మాదిరిగానే లియో మూవీలో కూడా లోకేశ్ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్టు సమాచారం. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే రికార్డు వసూళ్లు సాధించిన తొలి సినిమా గా లియో వార్తల్లోకెక్కుతోంది.
ఈ సినిమాను డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ హక్కులను కొన్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది.
ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఎల్సీయూలో ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. విక్రమ్ సినిమాతో లోకేశ్ యూనివర్స్లో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చివర్లో రోలెక్స్ క్యారెక్టర్ ఎండింగ్తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.
ఇప్పుడీ లియో మూవీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా విడుదలకు ముందే రూ.400 కోట్లు సాధించిన తొలి సినిమాగా లియో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.