అమెజాన్ రక్షణకు డికాప్రియో 5 మిలియన్ డాలర్ల విరాళం
హాలీవుడ్ స్టార్ హీరో, పర్యావరణ ప్రేమికుడు లియోనార్డో డికాప్రియో దక్షిణ అమెరికాలో అమెజాన్ అడవుల పరిరక్షణకు 5 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు. అడవులు భూతాపాన్ని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాలలో అడవులు అంతరించిపోవడం వల్ల భూమిపై నివశించే జీవరాశుల జీవితాలకు ముప్పు ఏర్పడుతుంది. ముఖ్యంగా అమెజాన్ అడవిలోని వృక్షాలు కొంతకాలంగా తగులబడిపోతున్నాయి. ఈ అడవులు తగలబడిపోవడం వల్ల ప్రకృతిలో మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. ఈ మంటలు ఆపడానికి చేసే ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ నేపధ్యంలో ప్రకృతి ప్రేమికుడైన డికాప్రియో స్పందించారు.
అడవిలో అగ్నిని ఆపి అక్కడి వణ్యప్రాణులు, జీవరాశులను రక్షించడానికి, ప్రకృతి అందాలను కాపాడటానికి 5 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఆ విధంగా డికాప్రియో అందరికీ ఆదర్శంగా నిలిచారు.
#EarthAlliance has formed an emergency Amazon Forest Fund with $5m to focus critical resources for indigenous communities and other local partners working to protect the biodiversity of the Amazon against the surge of fires. Learn more & donate: https://t.co/uG2WoEoKqx pic.twitter.com/IbcubQCO4v
— Earth Alliance (@earthalliance) August 25, 2019