బార్సిలోనా క్లబ్‌తో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకు తాజాగా పీఎస్‌జీతో(పారిస్ సెయింట్-జెర్మెయిన్) ఒప్పందం కుదుర్చుకున్న అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీకి ఘనస్వాగతం లభిస్తోంది. ఇక పీఎస్‌జీ తరపున బరిలోకి దిగేందుకు పారిస్ చేరిన మెస్సీ.. అక్కడ అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగాడు. కుటుంబంతో సహా అందులోకి చేరాడు. అయితే మెస్సీ ఈ హోటల్‌లో బస చేసేందుకు చెల్లిస్తున్న అద్దె చర్చనీయాంశంగా మారింది.
లి రాయల్ మెనాకో అనే ఈ ఫైవ్‌స్టార్ హోటల్లో ఒక రాత్రి అద్దె 20 వేల పౌండ్లు. భారత కరెన్సీలో రూ. 17.50 లక్షలు. పారిస్‌లో పర్మినెంట్ నివాసం దొరికేవరకూ మెస్సీ ఈ హోటల్‌లోనే ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్‌జీ క్లబ్‌లో ఉన్న నెయ్‌మార్ కూడా గతంలో ఇదే హోటల్‌లో బస చేశాడు. ఇదిలా ఉంటే ఇంతవరకు చాంపియన్స్ లీగ్ గెలవని.. పీఎస్‌జీ మెస్సీకి ఏడాదికి 3.5 కోట్ల యూరోలు (దాదాపుగా రూ.300 కోట్లు) చెల్లించబోతున్నట్టుగా తెలుస్తోంది.