గత కొంత కాలంగా జనావాసాల్లోకి చిరుత పులులు వచ్చి హడావిడి సృష్టిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా చిరుతలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లోకి చిరుత దూరి నానా హంగామా చేసింది.
మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చిందో చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించింది. సింధేవాహి తాలూకా పరిధి కోట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో ఇంటి తలుపులు మూసివేసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు యజమాని. చిరుతను చూసేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.
అయితే ఇంటి వైపు ఎవరిని రానయకుండా చుట్టుపక్కల కర్రలు అడ్డంగా కట్టి రక్షణ ఏర్పాట్లు చేశారు. చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. త్వరగా చిరుతను బంధించాలని ఇంటి యజమానితో పాటు స్థానికులు అటవీ అధికారులను కోరుతున్నారు.
కాగా పులి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాగ్‌భిడ్ తాలూకాలోని విలం మసలి గ్రామానికి చెందిన కిషోర్ దాదాజీ వాఘ్మారే చేనులో పని నిమిత్తం వెళ్లగా ఆకస్మాత్తుగా దాడి చేసింది పులి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.