మధ్యప్రదేశ్లోని ఉమేరియా జిల్లా బంధవ్‌గడ్ టైగర్ రిజర్వ్‌లో అరుదైన దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. రెండు చిరుతపులులు చెట్టు కొమ్మపై కలయికలో ఉండగా వీడియో రూపంలో ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో నిడివి మొత్తం 30 సెకన్లు ఉంది.
మధ్యప్రదేశ్ టైగర్ ఫౌండేషన్ సొసైటీ సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ ఫేస్‌బుక్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. దానికి కాప్షన్ కూడా పెట్టింది. ఇది చాలా అరుదైన దృశ్యం, అంత సులభంగా ఎవరూ చూడలేరు, రెండు చిరుత పులులు చెట్టు కొమ్మపై కలయికలో ఉన్నాయి.. అని ఆ వీడియోను పోస్ట్ చేశారు.
కాగా ఆ వీడియోను రవి పథక్ అనే నాచురలిస్ట్ తీశారు. అందులో రెండు చిరుత పులులు చెట్టు కొమ్మపై బిజీగా ఉండడాన్ని గమనించవచ్చు. అయితే ఒక దశలో వీడియో తీస్తున్న వ్యక్తి వైపు మగ పులి చూసింది. మళ్లీ తన పనిలో తాను పడింది. కాగా ఆ వీడియోకు ఇప్పటికే 40వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. 2,700కు పైగా షేర్స్ వచ్చాయి.
ఆ వీడియో పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. వృక్ష ప్రేమికులకు ఈ సంఘటన వల్ల కొత్త పేరు పెట్టాలని ఒక యూజర్ కామెంట్ చేయగా.. ఆ ఫొటోగ్రాఫర్ చాలా లక్కీ అని మరొకరు కామెంట్ చేశారు. అడవిలో చాలా అందమైన దృశ్యం కనిపించింది.. అని ఇంకొకరు కామెంట్ చేశారు. కాగా నవంబర్ 30వ తేదీన ఆ వీడియోను చిత్రీకరించగా అదే రోజు రాత్రి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు గంటకు లక్ష వ్యూస్ వస్తున్నాయని, 10 మిలియన్ల వ్యూస్ త్వరలోనే వస్తాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
మధ్యప్రదేశ్ టైగర్ ఫౌండేషన్ సొసైటీని 1997లో జనవరి 15న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పులుల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
Watch Video: