పక్కా కమర్షియల్ సినిమాకు డిఫరెంట్ ప్రమోషన్ ఎత్తుకున్నారు మేకర్స్. సినిమా గురించి చెప్పడం కామన్. అలా కాకుండా టికెట్ రేట్ల గురించి అంతా మాట్లాడుతున్నారు. తమ సినిమాకు టికెట్ రేట్లు భారీగా తగ్గించామని, అంతా ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని కోరుతున్నారు.
తమది పేరుకే పక్కా కమర్షియల్ అంటున్నాడు హీరో గోపీచంద్. తమ సినిమాకు నాన్-కమర్షియల్ రేట్లు పెట్టామని చెబుతున్నాడు. ఈమధ్య కాలంలో ఇంత తక్కువ టికెట్ రేట్లు రాలేదని ఊరిస్తున్నాడు.
“నేను ఈ సినిమా చెయ్యడానికి కారణం యూవీ క్రియేషన్స్ వంశీ. ఈ సినిమా చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. రాశిఖన్నా ఈ సినిమాలో మంచి రోల్ చేసింది. ఈ మూవీకి నాన్ కమర్షియల్ టికెట్ రేట్స్ పెట్టారు. మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చెయ్యండి. అల్లు అరవింద్, బన్నీ వాసు, మారుతీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నాడు.
ఈ విధంగా పక్కా కమర్షియల్ సినిమాకు పక్కాగా ప్రమోషన్ చేస్తున్నాడు గోపీచంద్. లాంగ్ గ్యాప్ తర్వాత తన నుంచి ఓ కామెడీ సినిమా వస్తోందని, కచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నాడు ఈ మ్యాచో హీరో. రాశిఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై 1న రిలీజ్ అవుతోంది. ప్రచారాన్ని మాత్రం ఇప్పట్నుంచే మొదలుపెట్టారు.