ప్రధాని మోడీకి బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుబెట్టుకోవాలని లేఖలో వారు కోరారు.
మహిళా రిజర్వేషన్లపై వెంటనే తేల్చాలంటూ లేఖలో వారు డిమాండ్ చేశారు. వెంటనే ఈ విషయంలో కేంద్రం ఓ సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
మహిళా రిజర్వేషన్లపై భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత చేపట్టిన దీక్షకు వారు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని వారు కోరారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇచ్చి పదవులు కట్టబెట్టిందన్నారు. లేఖ రాసిన వారిలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వున్నారు.