ఢిల్లీలో మరోసారి సీఎం కేజ్రీవాల్ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తిరస్కరించారు. వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేసి, కరోనా నిబంధనలు సడలించాలంటూ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు. వీకెండ్ లాక్ డౌన్ కి అసమ్మతి వ్యక్తం చేసిన ఎల్జీ 50 శాతం సామర్థ్యంతో ప్రైవేటు ఆఫీసులు తిరిగి పునరుద్దరించేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు.
ప్రైవేటు కాలేజీలు 50 శాతం సామర్థ్యంలో తిరిగి పనిచేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని.. కానీ, కరోనా పరిస్థితులు మెరుగయ్యే వరకూ వీకెండ్ కర్ఫ్యూలు ఎత్తివేయడం, మార్కెట్లు తెరవడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ఎల్జీ కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు మహమ్మారి కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ సర్కార్ కరోనా కట్టడికి జనవరి 4న వీకెండ్ లాక్ డౌన్ విధించింది. దీంతో పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే.. కరోనా నిబంధననలతో కరోనా కాస్త తగ్గుముఖం పట్టిందని ఆంక్షలు సడలించేందుకు సన్నాహాలు చేశారు.
ఢిల్లీలో అమలులో ఉన్న వీకెండ్ కర్ఫ్యూను ఎత్తి వేసేందుకు.. 50శాతం సామర్థ్యంతో ప్రైవేటు కార్యాలయాలల్లో పని చేసేందుకు అనుమతి ఇచ్చేందుక సిద్ధమైంది. ఢిల్లీలో ఇప్పటి వరకు వ్యాపారల విషయంలో అమలులో ఉన్న సరి బేసి సంఖ్య విధానాన్ని రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది. అయితే గవర్నర్ దీనిపై విముఖత వ్యక్తం చేశారు.