ఎల్జీ పాలిమర్స్ అనేది మంచి సంస్థ అని, ప్రపంచ దేశాల్లో ఉన్న సంస్థ అని సీఎం జగన్ కితాబిచ్చినప్పటికీ విశాఖలో ఉన్న ప్లాంట్స్ కు అన్ని అర్హతలున్నాయా…? అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం 415టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ కంపెనీ, 655టన్నుల ఉత్పత్తికి పెంచేందుకు అనుమతులు కోరింది.
2018 జనవరిలో 168కోట్లతో ఈ ప్రపొజల్స్ పెట్టగా డిసెంబర్ 2021 వరకు ఉండనుంది. అయితే, 2019 మే నెలలో స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంటల్ ఎసెస్మెంట్ కమిటీ సరైన అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉత్పత్తి చేస్తుందని గుర్తించింది. పెట్రో కెమికల్ ప్రాసెసింగ్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని తేల్చింది. అయితే ఏపీపీసీబీ అనుమతితో కంపెనీ ఉత్పత్తిని కొనసాగించింది.
అయితే… ఏప్రిల్ 14 తర్వాత మొదటి విడత లాక్ డౌన్ అయిపోగానే ఎసెన్షియల్స్ పేరుతో ప్రభుత్వంలోని పెద్దల నుండి లాబీయింగ్ చేసుకొని కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కంపెనీలో మచిలీపట్నంకు చెందిన పూర్ణచంద్ర మోహన్ రావు పిచ్చుక అనే వ్యక్తి డైరెక్టర్ గా ఉండగా… 2018లో మారరని తెలుస్తోంది.
ఇక స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంటల్ ఎసెస్మెంట్ కమిటీకి ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉత్పత్తి పెంపుపై ఓ లేఖ రాసి చేతులు దులుపుకుందని, కేవలం 4.5లక్షల పూచికత్తుతో పనికానిచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ డాకుమెంట్స్ చెప్తాయి విశాఖలో జరిగిన ప్రమాదం
కి కారణం వైసీపీ ప్రబుత్వం పరిపాలనా లోపం అని.ప్రొడక్షన్ రెట్టింపు చెయ్యాలి ఆంటే ముందు EIA అనుమతులు కావాలి కాని ఆంద్రప్రదేశ్ ప్రబుత్వం
అవేమీ లేకుండా కేవలం 4.5 లక్షల బ్యాంకు పూచీతొ. pic.twitter.com/QBsiDBpg0W— Pamulapati dhanunjaya Tarak (@dhanatarak3) May 7, 2020