జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులు జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అనే మాట వాస్తవం. కొన్ని తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం… కొన్ని కొందరు వద్దని చెప్పినా సరే వినకుండా పొగరుగా చేస్తూ ఉంటాం. అసలు మనలో ఉండకూడని లక్షణాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. అలాంటివి వదిలేస్తేనే బాగుంటుంది అని చాణక్య నీతి చెప్తుంది. ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి విజయం సాధించడానికి కొన్ని వ్యవహారాలకు, లక్షణాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:నా మిత్రుడి ఆహ్వానం మేరకు భారత్ కు వస్తున్నా
వ్యసనం: మద్యం లేదా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యసనాలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మానసికంగా శారీరకంగా మనం నాశనం అవుతూ ఉంటాం. కెరీర్ పై దృష్టి కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అనుకున్న పనుల్లో విజయం సాధించలేకపోవడం, అవమానాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే జీవితంలో ముందుకు వెళ్ళడం సాధ్యం.
సోమరితనం; మన జీవితాన్ని సోమరితనం నాశనం చేస్తూ ఉంటుంది. వ్యక్తికి ఎంత ప్రతిభ ఉన్నా సరే సోమరితనం ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉండే వ్యక్తికి సోమరితనం అనేది ఒకరకంగా శాపం అనే చెప్పాలి. కాబట్టి సోమరితనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
చెడు సావాసాలు; యవ్వనంలో చెడు సావాసాలు అనేది మనకు ఎంత మాత్రం మంచిది కాదు. వ్యక్తి వ్యసనాలకు, చెడు లక్షణాలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. విలువైన సమయం, డబ్బు వృధా కావడం వంటివి జరుగుతున్నాయి. అందుకే మంచి స్నేహితులతో ఉండాలని పెద్దలు కూడా చెప్తారు. మంచిని రూపాయి ఇచ్చి అయినా తెచ్చుకోవాలి, చెడుని రూపాయి ఇచ్చి అయినా వదిలించుకోవడం మంచిది అని చాణక్య నీతిలో పేర్కొన్నారు.
Also Read:దయనీయంగా ఆప్ఘన్ పరిస్థితి… రోజుకు 170 మంది చిన్నారులు మృతి