విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మద్య పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
లాక్ డౌన్ తర్వాత ఇటీవలే ఈ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఆ అప్డేట్ ని ఇస్తూ సెట్స్ లో తీసిన ఫోటో ను షేర్ చేశారు నిర్మాత ఛార్మి .
మరోవైపు మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండడంతో హైదరాబాద్ కు ఈ సినిమా షూటింగ్ తరలించాలని ప్లాన్ చేస్తున్నారట లైగర్ మేకర్స్. ఇప్పటికే ముంబైలో ఎక్కువ భాగం ఈ సినిమా షూటింగ్ జరిగింది. మిగిలిన చిత్రాన్ని మాత్రం హైదరాబాదులో పూర్తి చేయనున్నారట.
కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఆగస్టు 25న ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
Last leg of #LIGER schedule 🙌 pic.twitter.com/S4ud4AGX4M
— Charmme Kaur (@Charmmeofficial) February 4, 2022
Advertisements