మంచిర్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పిడుగు పడి టూవీలర్ పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది.
సీసీసీ కాలనీకి చెందిన కుటుంబం… ఫ్లైఓవర్ పై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.