బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ వివాహంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్వరా భాస్కర్ పై విశ్వహిందూ పరిషత్ నేత సాద్వీ ప్రాచీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వరా భాస్కర్ ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటారని ఆమె తెలిపారు. అందువల్ల ఆమె వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటుందని తాను ముందే ఊహించానన్నారు.
ఇప్పుడు అదే జరిగిందన్నారు. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్నారు. ఆమె ఎంపీ ఫహద్ అహ్మద్ ను వివాహం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. స్వరా త్వరలోనే ఇంటికి తిరిగి వస్తుందని లేదా ఆమెకు శ్రద్దావాకర్ పరిస్థితి ఎదురవుతుందన్నారు.
శ్రద్దావాకర్ లాగా స్వరా కూడా ఏ ఫ్రిజ్ లోనో లేదా సూట్ కేసులోనో కనిపించవచ్చన్నారు. స్వరా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఓ సారి ఫ్రిజ్ వైపు చూసి ఉండాల్సిందన్నారు. ఇంతకు మించి తాను ఏమి చెప్పలేనన్నారు.
కానీ స్వరాకు కూడా శ్రద్దా పరిస్థితి వస్తుందని తాను చెప్పగలనన్నారు. అలా కాకుంటే త్వరలోనే స్వరా విడాకుల వార్తలు వస్తాయని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు స్వరా భాస్కర్ స్పందించకపోవడం గమనార్హం.