రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఆ దేశ ప్రజలు హత్య చేయాలని యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం పిలుపు నిచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అంతం చేయడానికి ఇది ఏకైక మార్గమని ఆయన అన్నారు.
రష్యా సైన్యంలో బ్రూటస్ (జూలియన్ సీజర్ అనే రోమన్ జనరల్ ను హత్య చేశాడు) లేదా మరింత విజయవంతమైన కల్నల్ స్టాఫెన్‌బర్గ్(అడాల్ఫ్ హిట్లర్ ను హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు)లు ఉన్నారా ? అంటూ ప్రశ్నించారు.
“రష్యాలోని ఎవరైనా ఈ వ్యక్తిని చంపడమే దీనికి ఏకైక మార్గం. అలా చేస్తే మీరు మీ దేశానికి, ప్రపంచానికి చాలా గొప్ప సేవ చేస్తారు” అని ట్వీట్ చేశారు.
మరో ట్వీట్ లో దీనిని సరిదిద్దగల ఏకైక వ్యక్తులు రష్యన్ ప్రజలు మాత్రమే అని ఆయన అన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మరింత తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.