హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ లింగిడి వెంకటేశ్వరులు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారణం మద్యమత్తులో కారు నడపడమేనని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరించి మద్యపాన నిషేధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారాన్ని పెంచిపోషిస్తుందని లింగిడి వెంకటేశ్వరులు ఆరోపించారు.
బంజారాహిల్స్ రోడ్డు నెం.2లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో రెయిన్ బో హాస్పిటల్ లో పనిచేస్తున్న త్రిభువన్ రాయ్, ఉపేంద్ర కుమార్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారుతో దూసుకెళ్లి అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.