ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మందుబాబులకు పెద్ద షాక్ ఇచ్చారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొత్తగా అగ్రిసెస్ ను తెరపైకి తెచ్చారు. క్రూడ్ ఆయిల్, ఆల్కహాల్, ముడి ఆయిల్, కొన్ని దిగుమతి చేసుకునే వస్తువులపై వ్యవసాయ, మౌలికసదుపాయల అభివృద్ధి సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ అగ్రిసెస్ కారణంగా ఆల్కాహాల్, క్రూడ్ ఆయిల్, పామయిల్, వంట నూనెల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆల్కాహాల్ బివరేజేస్‌పై కేంద్రం 100 శాతం సెస్‌ని ప్రతిపాదించింది. దాంతో మందు బాబుల ఊహించని విధంగా మద్యం రేట్లు భారీగా పెరగనున్నాయి. ముడి పామాయిల్‌పై 17.5 శాతం, దిగుమతి చేసుకున్న యాపిల్స్‌పై 35 శాతం, ముడి సోయాబీన్, సన్ ఫ్లవర్ నూనెలపై 20శాతం వ్యవసాయ సెస్‌ని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఫలితంగా ఈ ధరలన్నీ పెరగనున్నాయి.
వంట నూనెలు ఇప్పటికే లీటర్ కు 140రూపాయలు దాటగా, ఏప్రిల్ 1 నుండి మరింత ప్రియం కానున్నాయి. అయితే, పెట్రోల్-డీజిల్ పై మాత్రం సెస్ భారం అధనంగా పడకుండా చూస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.