ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ బుచ్చి బాబు ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో నిందితుడు రామ చంద్ర పిళ్లైతో కలిపి ఆయన్ని ఈడీ విచారించనున్నది. ఇప్పటికే పిళ్లై కస్టడీ గడువు ముగియాల్సి వుంది. కానీ మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు మరో మూడు రోజుల పాటు ఆయన కస్టడీని పొడిగించాలని ఇటీవల న్యాయస్థాన్ని ఈడీ కోరింది.
ఇది ఇలా వుంటే ఈ కేసులో రేపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈ క్రమంలో ఆమె మాజీ అడిటర్, రామ చంద్రపిళ్లైను ఈడీ విచారించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ విచారణలో వారు చెప్పే వివరాల ఆధారంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు చట్ట విరుద్దంగా తనను విచారణ కోసం ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును కోరారు. పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు.
కానీ ఆమె అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మధ్యంతర ఆదేశాల విషయంలో మౌనం పాటించింది. కేసు విచారణను వెంటనే చేపట్టలేమని తెలిపింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఆమె రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంది.