యూపీలో బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా రూ. 45 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలో మద్యంతో పాటు లైసెన్స్ ఫీజులను భారీగా పెంచేందుకు యోగీ సర్కార్ రెడీ అవుతోంది.
ఈ మేరకు తాజాగా 2023-24కు గాను నూతనంగా రూపొందించిన మద్యం పాలసీకి యోగీ ఆదిత్య నాథ్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజా నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ధరలు పెద్దమొత్తంలో పెరుగనున్నాయి.
దీంతో పాటు విదేశీ మద్యం, బీర్లు, భంగ్, మోడల్ షాపులకు సంబంధించిన లైన్సుల ఫీజు మొత్తాన్ని కూడా ఈ సారి 10 శాతం పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలో నడుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, బార్లలో మద్యం అమ్మకాలపై అధనంగా లైసెన్స్ ఫీజు పెంచనుంది.
ఈ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు వెచ్చిస్తామని యోగీ ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.