ఓవైపు పెరుగుతున్న అప్పుల భారం… మరోవైపు సంక్షేమ పథకాల కోసం నిధుల కటకట… ఇంకేముంది చార్జీలన్నీ బాదేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఫీజులు, భూముల విలువ పెంచేసి భారీగా సొమ్ము చేసుకుంటున్న సర్కార్ ఇప్పుడు విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచేందుకు రెడీ అయ్యింది.
ఇప్పటి వరకు తాము విద్యుత్ చార్జీలు అంతగా పెంచలేదని చెప్తూ భారీగా పెంచేందుకు రెడీ అవుతుండగా, నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కోసం… అంటూ బస్ చార్జీలు పెంచబోతున్నారు. ఎంత బాదుతారు అన్నదే క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, చార్జీల పెంపు ఇంతటితో ఆగేలా లేదు.
ఆస్తి పన్ను, వాటర్ బిల్లులు, మున్సిపాలిటీల్లో మ్యూటేషన్ ఫీజులు కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు వీటిపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. అన్ని ఫీజులు ఒకేసారి పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.