మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 150కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా నిలిచారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది.
అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలకు కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించి ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!
అదేంటంటే ఆ అక్షరంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయట. చిరంజీవి గతంలో నటించిన ఆరని మంటలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆలయ శిఖరం, ఆరాధన, ఆపద్బాంధవుడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ కి బదులుగా “హరీష్ శంకర్” గబ్బర్ సింగ్ లో నటించిన సీన్స్ ఏవో తెలుసా ?
అయితే ఇప్పుడు ఈ విషయం గుర్తించిన ఫ్యాన్స్ చిరంజీవి టైటిల్ విషయంలో ఆ అనే అక్షరానికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్,భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు చేస్తున్నాడు.