మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఒకప్పుడు దర్శక నిర్మాతలకు పండగే. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే లాభాలు మాత్రం వచ్చేవి నిర్మాతలకు. అందుకే చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఎందరో నిర్మాతలు ఆసక్తి చూపించే వారు. ఇక చిరంజీవి కొన్ని సినిమాలు చేయాల్సి ఉన్నా సరే అవి మొదలైన తర్వాత ఆగిపోయాయి. ఒకసారి ఆ సినిమాల జాబితా మనం చూస్తే…
Also Read:అసెంబ్లీలో రాజకీయ ఫైట్..!
సింగీతం శ్రీనివాసరావు రచించిన ఒక కథను చిరంజీవి చేయాల్సి ఉంది. భూలోక వీరుడు అనే టైటిల్ తో అశ్వినీ దత్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రావాల్సి ఉంది. ఈ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది.
ఇక అభూ భాగ్దాద్ గజదొంగ అనే సినిమా సురేష్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి చేయాల్సి ఉంది. కాని ఆ సినిమా మొదలైన తర్వాత ఆగిపోయింది.
కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో… వజ్రాల దొంగ అనే సినిమా కూడా చేయాల్సి ఉన్నా సరే అది కూడా ఆగిపోయింది.
ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనుకుని ముందుకు వెళ్ళారు. ఆ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కూడా చిరంజీవి సినిమా చేయాల్సి ఉంది. హిట్లర్ సినిమా తర్వాత వర్మ తో సినిమా చేయాల్సి ఉన్నా సరే ఆ సినిమా కూడా ఆగిపోయింది. రెండు పాటలు కొన్ని ఫైట్ లు కూడా షూట్ చేసారు.
ఇక ఫ్యామిలీ సినిమాల విషయంలో దూకుడుగా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి తో ఒక సినిమా అనుకున్నా సరే కొన్ని కారణాలతో ముందుకు వెళ్ళలేదు.
పలు ఫ్యామిలీ సినిమాలతో దూకుడుగా ఉన్న ఆదిత్య తో కూడా చిరంజీవి సినిమా చేయాలి అనుకున్నా ముందుకు వెళ్ళలేదు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా చేయాలనుకున్నారు. రీ ఎంట్రీ సినిమాగా ఇది ముందుకు వెళ్తుంది అని భావించారు. కాని ఆ సినిమా కూడా ఆగిపోయింది.
Also Read:అప్పటి ఫలితం అప్పుడే తెలుస్తుంది..!