ఒకప్పుడు హీరోలు దర్శకులుగా నిర్మాతలుగా మారడం మనం చూసే వాళ్ళం. మన తెలుగులో చాలా మంది హీరోలు ఈ ప్రయత్నాలు చేసారు. కొందరు విజయవంతం అయితే కొందరు ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్, కృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ అడుగులు వేసారు. జాని సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ఆలోచన చేయలేదు. అయితే ఈ మధ్య కాలంలో హీరోలు తమ సినిమాలకు తామే కథలు రాస్తున్నారు.
Also Read:వన్ టైం వార్.. నువ్వా నేనా..?
ఈ మధ్య కాలంలో కథలు, స్క్రీన్ ప్లే లు సిద్దం చేస్తున్న హీరోల జాబితా ఒకసారి చూస్తే…
నవీన్ పోలిశెట్టి…
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించాడు.
అడవి శేష్
క్షణం సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించాడు. అలాగే గూడచారి సినిమాకు కథ అందించాడు. ఎవరూ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందించాడు.
కిరణ్ అబ్బవరం
ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది.
సిద్దు జొన్నలగడ్డ…
కృష్ణ అండ్ హిస్ లీల సినిమాకు స్క్రీన్ ప్లే అందించాడు. ఇటీవల వచ్చిన డీజే టిల్లు సినిమాకు కథ అందించాడు. కథ అందించడమే కాకుండా దర్శకత్వ సహాయం కూడా చేసాడు. అదే విధంగా పాటలు కూడా పాడుతున్నాడు ఈ హీరో.
Also Read:రెబల్ నుంచి రెండో సారి సీఎం వరకు