సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. భానుడి ప్రతాపానికి తాళలేక ప్రజలు అల్లాడి పోతున్నారు. చాలా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
తాజాగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్పియస్ దాటిన నగరాల జాబితాను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. ఆ జాబితాలో యూపీలోని భాండా 47.4 డిగ్రీల సెల్పియస్ తో మొదటి స్థానంలో ఉంది.
ఆ తర్వాత స్థానంలో ప్రయాగ్ రాజ్ 46.8 డిగ్రీల సెల్పియస్ తో నిలిచింది. రాజస్థాన్ లోని గంగానగర్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో 46.4డిగ్రీల సెల్పియస్ నమోదైంది.
యూపీలో ఝాన్సీ, ఢిల్లీలోని స్పో్ర్ట్స్ కాంప్లెక్స్ అబ్జర్వేటరీ, తూర్పు మధ్యప్రదేశ్ లోని నౌగాంగ్ ప్రాంతంలో 46.2 డిగ్రీలు, జార్ఖండ్ లోని డాల్టన్ గంజ్ లో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.