ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో ఇండియా తన ప్రత్యేకతను, సత్తాను నిరూపించుకుంటూనే ఉంది. ‘ఎత్తర జెండా..తిప్పర మీసం’ అన్నట్టు అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మెరుస్తూనే ఉంది. 2021 నాటికి పలువురు భారతీయ సినీ ప్రముఖులు, చిత్రాలు వివిధ కేటగిరీల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యాయి. ఆ ఏడాదిలో 13 మంది భారతీయులు నామినేట్ కాగా 8 మందిని ఆస్కార్ వరించింది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. 30 వ అకాడమీ అవార్డుల సందర్భంలో 1957 లో మెహబూబ్ ఖాన్ మూవీ.. ‘మదరిండియా’ చిత్రం భారత తొలి నామినేషన్ కు ఎంపికయింది.
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి సెలెక్ట్ అయినప్పటికీ కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ..’నైట్స్ ఆఫ్ కెబీరియా’ అనే ఇటాలియన్ చిత్రం కారణంగా అవార్డును దక్కించుకోలేకపోయింది. 1982 లో 55 వ అకాడమీ అవార్డుల సందర్భంగా ‘గాంధీ’ సినిమాకు గాను భాను అథయా ..బెస్ట్ కాస్ట్యూమ్స్ కేటగిరీ విభాగంలో ఆస్కార్ పురస్కారం పొందారు. ఈ అవార్డు దక్కించుకున్న తొలి భారతీయురాలయ్యారు . ఇదే మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ గా రవిశంకర్ నామినేట్ అయ్యారు. 1992 లో బెంగాల్ ప్రముఖుడు సత్యజిత్ రేకి హానరరీ అకాడమీ అవార్డు లభించింది. 2001 లో ‘సలాం బాంబే’, ‘లగాన్’ చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయ్యాయి.
2008 లో బ్రిటిష్ ఫిల్మ్ .. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకు గాను రసూల్ పోకుట్టి, ఏ.ఆర్.రెహమాన్ బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అకాడమీ అవార్డు పొందారు.
గుల్జార్ రచించిన ‘జైహో’ సాంగ్ కి గాను రెహమాన్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పురస్కారం లభించింది. ఇప్పుడు ఈ 2023 లో జక్కన్న, రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ .. తమ ‘నాటు నాటు’ పాటతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేయడం విశేషం.