సీఎం కేటీఆర్ అంటూ టీఆర్ఎస్ నేతల జపం కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం చేసిన తర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇది తెలిసే నేతలంతా… కేటీఆర్ సీఎం అంటూ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారన్న వాదన తెరపైకి వస్తోంది.
కేటీఆర్ సీఎం అయితే సొంత టీం ఏర్పాటు చేసుకుంటారన్నది తెలిసిందే. ఇప్పుడున్న మంత్రివర్గంలో కనీసం సగం మందికి మళ్లీ ఛాన్స్ ఉండకపోవచ్చన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. దీంతో తమకు ఎలాగైనా ఛాన్స్ దక్కుతుందని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ నుండి రేసులో బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్ జీవన్ రెడ్డితో పాటు హైదరాబాద్ నుండి పద్మారావు, తలసాని,దానం కరీంనగర్ నుండి కొప్పుల, గంగుల, అదిలాబాద్ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, వరంగల్ నుండి దాస్యం వినయ్ భాస్కర్, ఖమ్మం నుండి పువ్వాడ అజయ్ కుమార్, అదిలాబాద్ నుండి బాల్కసుమన్, మహబూబ్ నగర్ నుండి శ్రీనివాస్ గౌడ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రంగారెడ్డి నుండి పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ నేతలంతా కేటీఆర్ ముఖ్యమంత్రి అని గట్టిగానే ప్రకటిస్తున్నారు.