టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు ఎలా ఉన్నా సరే చూసే ప్రేక్షకులు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను వదులుకున్నారు. ఆ సినిమాలు కూడా చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కెరీర్ ఇంకోలా ఉండేది అంటారు టాలీవుడ్ జనాలు.
ఆయన వదులుకున్న సినిమాలు ఏంటీ అంటే… 2000 ఏడాది లో విడుదల అయిన తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే కావాలి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో టాలీవుడ్ లో తరుణ్ అడుగుపెట్టాడు. అయితే ఈ సినిమాను అమీషా పటేల్ తో కలిసి పవన్ చెప్పాలని ఉంది పేరుతో శ్రీ సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో పవన్ చేయాల్సి ఉంది. 20 శాతం కూడా షూటింగ్ పూర్తి అయినా సినిమాను ఆపేశారు.
జానీ సినిమాతో డైరెక్టర్ గా మారాలని భావించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో ఇబ్బంది పడ్డారు. ఇక ఆ తర్వాత ఖుషీ సినిమాతో ఫాం లోకి వచ్చిన ఆయన సత్యాగ్రహి అనే సినిమాను మొదలుపెట్టారు. అల్లు అరవింద్ నిర్మాతగా ఈ సినిమా మొదలైనా… షూటింగ్ కొంత జరిగినా విడుదల కాలేదు.
సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా ప్రారంభించారు. జీసస్ క్రైస్ట్ పాత్రలో పవన్ నటించాలి. ఈ సినిమా షూటింగ్ ని జెరూసలేం లో షూట్ చేసారు. కాని ఇది కూడా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అయితే ఆయన చేతులారా టాప్ సినిమాలను వదులుకున్నారు. ఈడియట్, పోకిరి, అతడు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, గోలీ మార్, మిరపకాయ్ లాంటి సినిమాలను కూడా పవన్ వదులుకున్నారు.